ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేష్ కార్పోరేషన్, నేషనల్ హైవే ఆధారటి ఆఫ్ ఇండియా, పంచాయితీ, డిడబ్ల్యూఎమ్ తదితర శాఖల అధికారులతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంకు ఎదురుగా నేషనల్ హైవేకు పక్కనే ఉన్న వెటర్నరీ సైన్స్ కళాశాలకు వద్ద సుందరికరణకు, రామవరప్పాడు నుండి ఎయిర్ పోర్టు వరకు చేయాల్సిన పనులపై చర్చించారు.