గన్నవరం మండలం మర్లపాలెం గ్రామంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇళ్ల ను మంగళవారం గన్నవరం ఎంఎల్ఏ యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించి లబ్ధిదారులకు అందచేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్ష 80 వేల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని ఆ సొమ్ముతో లబ్ధిదారులు కల సాకారం అయ్యిందని చెప్పారు.