బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అమర్తల సోమేశ్వరరావు శనివారం ఉంగుటూరు మండలంలోని వరద బాధిత ప్రాంతాలైన ఆముదాలపల్లి, ఎలుకపాడు గ్రామాలలో పర్యటించారు. అనంతరం వరద బాధితులకు మాజీ అధ్యక్షులు సోము సొంత నిధులతో గన్నవరం బార్ అసోసియేషన్ సభ్యులతో కలసి నూతన వస్త్రములను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నల్లమోతు రమేష్, రామకూరి ప్రకాశరావు, ఉంగుటూరు ఎస్సై గోవిందు, ఎలుకపాడు సర్పంచ్ నాని, నిరీక్షణరావు పాల్గొన్నారు.