మెక్సికోలో ఈ నెల 18 - 21 తేదీల్లో జరిగే నోబెల్ శాంతి పురస్కార గ్రహీతల గ్లోబల్ సమిట్ కు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కి గురువారం ఆహ్వానం లభించింది. వరల్డ్ సమిట్ ఆఫ్ నోబెల్ పీస్ లారేట్స్ అధ్యక్షులు, శాశ్వత కార్యదర్శి ఎకటెరీనా జగద్లీనా బుద్ధప్రసాద్ కి ఆహ్వానం పంపారు. మెక్సికో దేశంలోని న్యూవో లియోన్ రాష్ట్ర 200 ఆవిర్భావ వేడుకలు పురస్కరించుకొని పీస్ ఫర్ ప్రోగ్రెస్ కార్యక్రమం చేపట్టారు.