రేవులో పంటు రాకపోకలు పున: ప్రారంభం

75பார்த்தது
రేవులో పంటు రాకపోకలు పున: ప్రారంభం
సఖినేటిపల్లి రేవులో గోదావరి వరద కారణంగా గత కొన్ని రోజుల నుంచి నిలిపి వేసిన పంటు రాకపోకలను సోమవారం పునరుద్ధరించారు. సఖినేటిపల్లి-నరసాపురం మధ్య వశిష్ట గోదావరి నదిలో పంటు రాకపోకలు యధావిధిగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం రేవులో రాకపోకలను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికులు గమనించాలన్నారు.

தொடர்புடைய செய்தி