గణపతి ఉత్సవాలను పురస్కరించుకుని నిబంధనలు మీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ ఎ. వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గురువారం సాయంత్రం కడియం పోలీస్ స్టేషన్ వద్ద అయిన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా నిమజ్జనాల సందర్భంగా కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటించాలన్నారు.