రాజమండ్రి నగరంలో మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. శనివారం సాయంత్రం రాజమండ్రి నగరంలోని 7వ డివిజన్లో నిర్వహించిన 'మీ భద్రత మా బాధ్యత' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఏ విధమైన సమస్యలు ఉన్నా వాటిని అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని అన్నారు.