దీపావళి పండుగ సందర్భంగా సామర్లకోట మండలంలలో బాణాసంచా వ్యాపారాలకు పెద్దఎత్తున వ్యాపారానికి సన్నద్ధం అవుతున్నారు. శుక్రవారం పలు శాఖలకు చెందిన అధికారులు తుది పరిశీలన చేశారు. మండలంలో ప్రతీయేటా సుమారు రు. 4కోట్ల మేర బాణాసంచా వ్యాపారం జరుగుతుండడంతో ఇక్కడ తయారు చేసే బాణాసంచా కన్నా, శివకాశీ బాణాసంచా సామాగ్రిని సైతం వ్యాపారులు విక్రయాలకు సిద్ధం చేసారు.