మండపేట నియోజకవర్గం పరిధిలోని కపిలేశ్వరపురం మండలం నేలటూరు గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షుల పుల్లాజీ ని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శనివారం అభి నందించారు. పుల్లాజీ తన చేనేత మగ్గంతో వస్త్రం పై టిడిపి, జనసేన పార్టీ గుర్తులను తయారు చేసి మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ళ ను కలసి తను తయారుచేసిన వస్తాలను ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఆవిష్కరించారు.