పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలకు డిగ్రీ పూర్తియిన యువత పెద్ద ఎత్తున ఓటు నమోదు చేసుకోవాలని టిడిపి రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మౌలానా పిలుపునిచ్చారు. మండపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ ఓటు నమోదుకు చివరి తేది నవంబర్ 6 అన్నారు. ఓటు నమోదు చేసుకోవటం, ఓటు వేయటం తమ బాధ్యత అన్నారు. ఫామ్ 18 పూర్తి చేసి, డిగ్రీ ప్రొవిజనల్ (అటెస్టెడ్), ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్ పోర్టు సైజ్ ఫోటోతో అందచేయాలని కోరారు.