కాకినాడ: చిన్న పిల్లల సురక్షితమైన జిల్లాగా కృషి

78பார்த்தது
కాకినాడ: చిన్న పిల్లల సురక్షితమైన జిల్లాగా కృషి
జిల్లాలో చిన్నారుల భద్రత రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ నూరు శాతం చిన్న పిల్లల సురక్షితమైన జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావనా, లతో కలిసి హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி