గోపాలపురం మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఉదయం భానుడు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో మండలంలో పెద్దాపురం, చిట్యాల, కోమటికుంట, జగన్నాధపురం గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచుకొట్టింది. తద్వారా లోతట్టు ప్రాంతాలు, రహదారులు పూర్తిగా నీట మునిగాయి. దీంతో గంటన్నర సేపు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అధికారులు సహకరించాలని కోరారు.