మహిళల జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. తుని పట్టణంలోని బ్యాంక్ కాలనీలో మహిళల జూనియర్ కళాశాలో గురువారం ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షున జరిగింది. అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా డివి రాజు, సభ్యులుగా దర్శి మోహన్ కృష్ణ, నారాయణచార్యులు, చెల్లి బోయిన రామకృష్ణ, రెడ్డి రత్నం, ఇల్లాల గిరి, సుబ్బారావు, శ్రీనివాస్ సభ్యులచే ఎమ్మెల్యే యనమల దివ్య ప్రమాణ స్వీకారం చేయించారు.