హర్ ఘర్ తిరంగా వేడుకల్లో భాగంగా మంగళవారం పెద్దాపురంలో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సుమారు 300 మీటర్ల పొడవు గల జాతీయ పతాకాన్ని చేత పెట్టి పట్టణంలో పురవీధుల మీదుగా ర్యాలీని నిర్వహించారు. జాతీయ జెండాతో విద్యార్థులు చేసిన ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ర్యాలి పొడవునా విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలాపిస్తూ తమ దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.