పెద్దాపురం ఆర్థివోగా డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె రమణి నియమితులయ్యారు. ఇప్పటి ఆర్డివోగా విధులు నిర్వర్తించిన జె. సీతా రామారావుకు తదుపరి నియామక ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ సెక్రటరీయేట్కు రిపోర్ట్ చెయ్యాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఆర్డివోగా రమణి బాధ్యతలు చేపట్టారు. డిఆర్డిఎ పిడి గా చాలా కాలంగా పనిచేస్తున్న ఆమె, తాజా సాధారణ బదిలీల్లో భాగంగా పెద్దాపురం ఆర్థివోగా రానున్నారు.