రాజంపేట పట్టణం నూనెవారిపల్లి నివాసి, టిడిపి నేత, వాణిజ్య విభాగం అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ముల్లగూరి సుబ్రహ్మణ్యం నాయుడు పెదనాన్న ముల్లగూరి బ్రహ్మయ్య బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు వారి నివాసానికి వచ్చి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.