ఓబులవారి పల్లి లోని పలు కాలనీలలో రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ ఆదివారం పర్యటించి మురికి కాలువలను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.