గాలేరు - నగిరి కాలువను సత్వరం పూర్తి చేయాలి

78பார்த்தது
గాలేరు - నగిరి కాలువను సత్వరం పూర్తి చేయాలి
రైల్వే కోడూరు నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గాలేరు - నగరి కాలువను సత్వరం పూర్తిచేసి తాగునీరు, సాగునీరు అందించి రైతులను, ప్రజలను ఆదుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య కోరారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి రైల్వే కోడూరు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.రైల్వేకోడూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుచేసి అనారోగ్యం నుండి ప్రజలను కాపాడాలని కోరారు.

தொடர்புடைய செய்தி