ఉద్యాన పంటలలో వర్షపు నీరు నిలువ లేకుండా కాలువలు తీసి బయటకు పంపించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సందీప్, ఉద్యాన శాఖ అధికారి ఆయేషా రైతులను కోరారు. బుధవారం తుఫాను కారణంగా పంటచేలలో నిలిచిన నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట చేలో నీరు నిలువ ఉంటే వేరు కుళ్ళి పోవడం, పోషకాల లభ్యత తగ్గిపోయి మొక్కలు బలహీనంగా పెరుగుతాయి అన్నారు.