గడిచిన ఐదు నెలల చంద్రబాబు పాలనలో రాయలసీమకు పది అన్యాయాలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని సిఎం అమరావతికి తరలించారన్నారు. మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి 50 సీట్లు మంజూరు చేస్తే, వీటిని ప్రభుత్వం వద్దని కేంద్రానికి లేఖ రాసిందన్నారు. వచ్చిన 50 సీట్లు కొల్పోయారన్నారు.