పులివెందుల పట్టణంలోని స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణంలో సోమవారం పోస్టల్ ఏజెంట్లు, లియాపి నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు పోస్టల్ మేనేజ్మెంట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోస్టల్ ఏజెంట్లు మాట్లాడుతూ.. పాలసీదారులకు జీఎస్టీని తగ్గించాలని, బోనస్ పెంచాలని, ఏజెంట్ల కమిషన్ పెంచాలని, పెంచిన ప్రీమియంను తగ్గించాలని కోరుతూ డిమాండ్ చేశారు.