దుకాణాలలో, కుటీర పరిశ్రమలలో, హోటళ్లలో, పరిశ్రమలలో, పని ప్రదేశాలలో బాల కార్మికుల చేత పనిచేయించుకోవడం చట్టరీత్యా నేరమని ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీదేవి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిడిపిఓ తమ సిబ్బందితో కలిసి మైదుకూరు పట్టణంలోని దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపివో మాట్లాడుతూ బాల కార్మికుల చేత పనిచేయుచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.