విద్యార్థి దశలో విద్యార్థులు ప్రపంచ జ్ఞాన సంపాదనపైన మీ లక్ష్యాన్ని ఉంచాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కమలాపురం సిఐ షేక్ రోషన్ అన్నారు. మంగళవారం నెహ్రు యువ కేంద్ర కడప శాఖ ఆదేశాల మేరకు మదర్ థెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో "మాదక ద్రవ్యాల నిర్మూలన" పైన కమలాపురం సి ఎస్ ఎస్ ఆర్ & ఎస్ఆర్ఆర్ ఏమ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.