వైఎస్ షర్మిలపై ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్ జగన్ను అంతం చేయడమే షర్మిల లక్ష్యం. మమ్మల్ని సర్వనాశనం చేయాలని షర్మిల కంకణం కట్టుకుంది. షర్మిలమ్మ పుణ్యమా అని మా ఇంటి రామాయణం బజారులోకి వచ్చింది. అన్న మీద వేయాలనేదే షర్మిల ఉద్దేశం. షర్మిల లాంటి చెల్లెలు ఏ కొంపలో ఉండకూడదు.’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.