తుళ్ళూరు మండలంలో డెంగీ కేసులు.. రంగంలోకి వైద్య సిబ్బంది

61பார்த்தது
తుళ్ళూరు మండలంలో డెంగీ కేసులు.. రంగంలోకి వైద్య సిబ్బంది
తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం, వడ్డమాను గ్రామాల్లో డెంగీ జ్వరాల వ్యాప్తిపై వైద్య ఎకడమిక్ బృందం శనివారం పరిశీలన చేపట్టింది. ఇంటింటికీ తిరిగి జ్వరాల సర్వే చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్న అనంతవరానికి చెందిన మహిళ, వడ్డమానులో 11ఏళ్ల బాలుడు డెంగీ బారిన పడడంతో వైద్యులు రంగంలోకి దిగారు. వైద్య పరీక్షలు నిర్వహించి జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానికులకు వివరించారు.

தொடர்புடைய செய்தி