రెవిన్యూ సమస్యలు పరిష్కరిస్తామని పెదకూరపాడు మండల తహసిల్దారు దానియేలు అన్నారు. శుక్రవారం పెదకూరపాడు మండలంలోని తాళ్లూరులో రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. తాసిల్దార్ మాట్లాడుతూ తప్పులుగా ఉన్న వాటిని సరిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తాళ్లూరు గ్రామంలో 41 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ సర్వేర్లు స్థానిక నాయకులు పాల్గొన్నారు.