రహదారులు, కాల్వలు. ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పెదకూరపాడు తహసిల్దార్ మీసాల దానియేలు అన్నారు. గురువారం పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం, ఎస్సీ స్మశానాలకు వెళ్లే రహదారిని పెదకూరపాడు సర్పంచ్ గుడిపూడి రాజు, పెదకూరపాడు కార్యదర్శి సుధారాణితో కలిసి పరిశీలించారు. షాపులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.