ఇంకొల్లు: సాగర్ కాలువ వద్ద పొంచి ఉన్న ప్రమాదం

77பார்த்தது
ఇంకొల్లు మండలం ఇడుపులపాడు నుండి నాగండ్ల వెళ్లే రహదారిలో ఉన్న సాగర్ కాలువ ప్రమాదకరంగా మారింది. కాలువ నందు రక్షణ కవచంగా గోడ లేకపోవడంతో రాత్రి వేళల్లో కాలువలో పడి ప్రమాదాల బారిన పడుతున్నామని పలువురు వాహన చోదకులు వాపోయారు. ఇక కాలువ వస్తే కొట్టుకు పోవాల్సిందేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రాణం నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி