నరసరావుపేట: పురుగుమందు దుకాణాలలో తనిఖీలు

60பார்த்தது
నరసరావుపేట: పురుగుమందు దుకాణాలలో తనిఖీలు
నరసరావుపేటలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను సహాయ వ్యవసాయ సంచాలకులు మస్తానమ్మ, మండల వ్యవసాయ అధికారి నరేంద్ర సోమవారం సంయుక్తంగా తనిఖీ నిర్వహించారు. ఎరువుల స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాలను, ఇన్వాయిస్ కాపీలను పరిశీలించారు. స్టాక్ బోర్డు, ప్రైస్ బోర్డును రైతులకు కనపడే విధంగా షాపులలో ప్రదర్శించాలని సూచించారు. ఎరువులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி