భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పాత మంగళగిరిలో దెబ్బతిన్న చేనేత మగ్గాలను గురువారం ముగ్గురు సభ్యులు గల కేంద్ర బృందం, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాల వలన ప్రతిఏటా జరిగిన నష్టాన్ని వారికి వివరించారు. గుంట మగ్గాలకు బదులుగా స్టాండ్ మగ్గాలను ఇవ్వాలని కోరారు.