మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుతో గురువారం మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరకపూడిశెల ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన విధంగా ప్రతిపాదనలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో రహదారులు మౌలిక సదుపాయాల గురించి చర్చించారు.