మాచర్ల: బేకరీలో అధికారులు తనిఖీలు

84பார்த்தது
మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్లో గల మై బేకరీలో శుక్రవారం పురపాలక సంఘ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో బూజు పట్టిన ఆహార పదార్థాలు లభ్యం అవ్వడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి పదార్థాలపై బ్లీచింగ్ చల్లారు. బేకరీ యాజమాన్యంపై రూ. 15000 జరిమానా విధించినట్లు తెలిపారు. మున్సిపల్ ఏఈ గౌతమి సచివాలయ కార్య దర్శి బోస్ తదితరులు పాల్గొన్నారు. బయట ఆహార పదార్థాలు తినేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు.

தொடர்புடைய செய்தி