దుర్గి మండల పరిధిలోని గ్రామాలను అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి అన్నారు. సోమవారం దుర్గి మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి పాల్గొని మాట్లాడారు. అధికారులు ప్రజా ప్రతినిధులు భేషజాలకు పోకుండా పరస్పర సహకారం సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా శాఖల వారీగా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరారు.