గుంటూరు కలెక్టరేట్లో శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ విజయ భారతి సయాని జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు వసతిగృహ, పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పోషక ఆహారంపై ఆరాతీశారు. భోజనం తయారీ ఎక్కడ, పాఠశాలకు ఎలా తరలిస్తున్నారనే అంశాలను పీపీటీ ద్వారా జేసీ భార్గవ్ తేజ ఛైర్ పర్సన్ కు వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహరం అందించాలని అధికారులకు ఛైర్ పర్సన్ సూచించారు.