గుంటూరు : నిబంధనల ప్రకారమే బాణాసంచా దుకాణాలు

55பார்த்தது
దీపావళి పండుగను పురస్కరించుకొని బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ స్పష్టం చేశారు. బాణాసంచా విక్రయాలపై శనివారం గుంటూరు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫైర్, పోలీస్, రెవెన్యూ విభాగాలు సంయుక్తంగా తనిఖీలు చేసి అనుమతులు ఇవ్వాలని చెప్పారు. నిబంధనల ప్రకారమే ప్రతి బాణాసంచా దుకాణం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி