బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, లింగ వివక్షత రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గురువారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా గుంటూరు కలెక్టర్ లో ఉత్తమ ప్రతిభాపాటవాలు కనపరిచిన విద్యార్థులకు చిరు సన్మానంతో పాటు సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్, ఐసిడిఎస్పీడి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.