సంతమాగులూరు మండలం, పుట్టావారిపాలెంలోని మంత్రి గొట్టిపాటి అతిధి గృహం నందు శనివారం ఉదయం 11 గంటలకు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కార్యాలయ ప్రతినిధి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొంటారని, నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు.