బల్లికురవ మండలం అంబడిపూడి లో శుక్రవారం పల్లె పండుగ కార్యక్రమంలో నియోజకవర్గంలో ప్రభుత్వం నుండి మంజూరైన నలుగురు కు ముఖ్యమంత్రి సహాయ నిధిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ లబ్ధిదారులకు అందజేశారు. రూ.7, 60, 200లు ముఖ్యమంత్రి నుంచి సహాయం అందినట్లు మంత్రి తెలియచేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి బాసటగా నిలుస్తుందని రవికుమార్ తెలిపారు.