ఓ దాడిలో గాయపడిన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈదా సాంబిరెడ్డిని బుధవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు ఎస్. వి. ఎన్ కాలనీలోని ఆయన ఇంటిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా అండగా ఉంటామని సాంబి రెడ్డికి జగన్ భరోసా ఇచ్చారు.