ప్రతి నెలా రేషన్ కార్డుదారులకు రాయితీపై పంచదార, కందిపప్పు అందిస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం తెనాలిలో రేషన్ కార్డు దారులకు రాయితీపై కిలో కందిపప్పు, అర కిలో పంచదార అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో నాదెండ్ల మాట్లాడుతూ.. కిలో కందిపప్పు రూ.67, అర కిలో చక్కెర రూ.17కే ప్రభుత్వం అందిస్తుందన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి తృణధాన్యాలు కూడా పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.