ముఖ్యమంత్రి సహాయ నిధికి 83. 84 లక్షల రూపాయల డిడిని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి భీమ శంకరరావు, వాసవి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ సత్యనారాయణ, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుబ్బారావు, బాల కాశయ్య, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు కలిశారు.