ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకుడు వి. జయప్రకాష్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25 వరకు గడువు ఉందన్నారు. జిల్లాలో డీఎస్సీ పరీక్షకు హాజరవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు టెట్ అర్హత కలిగి ఉండి వార్షిక ఆదాయం రూ. 2. 50 లక్షలలోపు ఉండాలన్నారు.