ఈ నెల 17న ఉదయం 10 గంటలకు అరకు వ్యాలీలోని గిరిజన సంక్షేమ బాలుర క్రీడా పాఠశాలలో మిగిలిన ప్రవేశాలను భర్తీ చేయనున్నట్లు ఇన్ఛార్జి డీడీ, ఐటీడీఏ ఏపీవో నాయుడు శుక్రవారం తెలిపారు. బుట్టాయగూడెం మండలం కేఆర్.పురం గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. 7, 8 తరగతుల్లో 2 చొప్పున, 9వ తరగతిలో 3 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లా, మండల పరిషత్తు పాఠశాలల్లో చదువుతున్న వారు అర్హులన్నారు.