పాలకొల్లు: ప్రమాదకరంగా పాలకొల్లు టు పెనుమదం వెళ్లే రహదారి

55பார்த்தது
పాలకొల్లు పట్టణంలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు చిద్రమయ్యాయి. అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో గోతులు పడ్డాయి. ప్రధానంగా పాలకొల్లు నుండి పెనుమదం వెళ్లే రహదారికి అనేక చోట్ల లోతైన గోతులు ఏర్పడి, ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ప్రధానంగా ఆర్. ఆర్. ఆర్ రైస్ మిల్లు ఎదుట రహదారిపై ఏర్పడిన గోతుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే రహదారికి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி