నూజివీడు ఆసుపత్రిలో బుధవారం చిత్తూరు జిల్లా పాలసముద్రం ఎంపీటీసీ జగన్నాథం(40) మృతదేహం నవ్యం కావడంతో చిత్తూరు పోలీసులు నూజివీడులో విచారణ ప్రారంభించారు. ముసునూరుకి చెందిన వ్యక్తికి జగన్నాథంకు జెసిబి కొనుగోలు విషయమై వివాదం నెలకొంది. జగన్నాథంను ఈ నెల 21న చిత్తూరు జిల్లాలో 12 మంది కిడ్నాప్ చేసి నూజివీడు తీసుకొచ్చారు. జగన్నాథం మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.