నూజివీడు: బాల్యవివాహాలు ఒక సామాజిక రుగ్మత

51பார்த்தது
నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో బాల్యవివాహాలపై అవగాహన సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ నూరానీ మాట్లాడుతూ. బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు. బాల్య వివాహాలతో ఏర్పడే అనర్ధాలు, నష్టాలను సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే రీతిలో వివరించనున్నట్లు తెలిపారు. ఇది సమాజంలో ఒక రుగ్మతగా ఉన్నదన్నారు.

தொடர்புடைய செய்தி