ముసునూరు మండల పరిధిలోని చెక్కపల్లి గ్రామంలో ఈ నెల 24, 25వ తేదీలలో నిర్వహింప తలపెట్టిన ఆధార్ ప్రత్యేక క్యాంపు కేంద్రాలను వాయిదా వేసినట్లు ఎంపీడీవో జి. రాణి తెలిపారు. ముసునూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గురువారం మాట్లాడుతూ. సాంకేతిక కారణాలతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఆధార్ ప్రత్యేక క్యాంపు కేంద్రాలు వాయిదా వేశామని చెప్పారు. ఈ విషయం ప్రజలు గమనించాలని సూచించారు.