ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఇన్ చార్జ్ గొట్టిపాటి రవికుమార్ ను నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఆయన నియోజకవర్గాల్లోని పలు విద్యుత్ సమస్యలను మంత్రికి వివరించారు. అలాగే, నరసాపురం నియోజకవర్గానికి రావాలని ఆయన కోరారు.