కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకు సోమవారం పెను ప్రమాదం తప్పింది. కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులోకి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న కారు వెళ్లిపోయింది. అధికారులు నాయకులు ఒక్కసారిగా అప్రమత్తం కావడంతో ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఎమ్మెల్యే తో పాటు అధికారులు నాయకులు ఉన్నారు.