ఏలూరు జిల్లాలో వచ్చిన వరదల్లో లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలను రక్షించడంలో ఎస్.డీ.ఆర్.ఎఫ్, ఎన్.డీ.ఆర్.ఎఫ్ సిబ్బంది కీలక పాత్ర పోషించారని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారిని అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఆపదలో ఉన్న సమయంలో ప్రజలకు పోలీసు వారు చేసే సేవలను గుర్తించుకొని పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుందన్నారు.